చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం ఎంపీడీవోగా మనోహర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, నాయకుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తానని తెలియజేశారు.