పెనుమూరు మండలం లో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని గుడ్యానంపల్లెకు చెందిన మోహనాచారి (36)కి పాకాల మండలం గాదం కి గ్రామానికి చెందిన ఓ మహిళతో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు ఉండడంతో మోహనా చారి సెల్ఫీ వీడియోను గ్రామస్తులకు పంపి ఓ ప్రైవేటు క్వారీ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.