జగన్ కు ద్రోహం చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు: బాలసుబ్రహ్మణ్యం రెడ్డి

1290చూసినవారు
జగన్ కు ద్రోహం చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు: బాలసుబ్రహ్మణ్యం రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేయాలనుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. శ్రీరంగరాజపురం మండల కేంద్రం వద్ద విలేకర్ సమావేశంలో మాట్లాడుతూ జగన్ బొమ్మతో గెలిచినవారు ద్రోహం చేస్తే రాజకీయం మనుగడ కూడా సాగించలేరని జగన్ ఫోటో లేకుండా మళ్లీ గెలవగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కుర్చీలో పడితే భవిష్యత్తు శూన్యం అవుతుందని, సొంతమామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మీకు వెన్నుపోటు పొడవుడని గ్యారెంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు.

నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగనన్న లేకపోతే నువ్వు ఎవరు, నువ్వు ఎమ్మెల్యే అయ్యే వాడివే నా. , నీకు రాజకీయ బిక్షం ప్రసాదించిన జగనన్నకు వెన్నుపోటు పొడవడం న్యాయమేనా అని అన్నారు. నీకు దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో టిడిపిలో నిలబడి గెలువు చూద్దాం అని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికలు పేదవారికి పెత్తందానికి మధ్య జరుగుతుందని, పేదలందరు జగనన్న వైపు నిలబడితే అవినీతిపరులు బినామీలు దోపిడిదారులు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, నాయకులు మనీ, జనార్ధన్, మునికృష్ణ , చిన్నప్ప, కుప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్