వెదురుకుప్పం మండలంలో బెల్ట్ షాపు పై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నరసింహా రెడ్డి, మల్లికార్జున అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఇద్దరూ బెల్ట్ షాపులో నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి 51 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, 37 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలియజేశారు.