పేదల పెన్నిధి, సంక్షేమ రథసారథులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పద్మాపురం సచివాలయం పరిధిలో తెల్ల గుండ్లపల్లి, ఎన్ ఆర్ పురం గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన పద్మ మాట్లాడుతూ గత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరముల పరిపాలనలో ఎన్నడు ఇలాంటి పథకం చూడలేదని, కనీవిని ఎరుగని రీతులు కొత్త కొత్త పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి మమ్మల్ని ఆదుకుంటున్నారని తమ ఆనందాన్ని ఉప ముఖ్యమంత్రి కి తెలియజేసింది. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో కులం మతం వర్గం లింగం రాజకీయం వివక్షకతావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు దేశం మొత్తం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్న హాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడంలేదని చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ప్రజలను తప్పుదో పెట్టిస్తున్నదని, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ పెట్టుబడులు రావడంతో వరుసగా మూడుసార్లు కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు. నాడు నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా కానుక, మొదలగు పథకాలు ద్వారా మార్పు తీసుకువచ్చారన్నారు. గతంలో ఆంగ్ల విద్య పేదవారికి అందనీ ద్రాక్షల ఉండేవని నేడు జగనన్న ఆంగ్ల విద్యను ప్రతి విద్యార్థికి చేరువచేసామన్నారు. ప్రతి ఏట ఎనిమిదో తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులందరికీ ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేస్తున్నదన్నారు. టేబ్లు విద్యార్థులకు పంపిణీ చేయడం పంపిణీ చేయడం చంద్రబాబునాయుడుకి, ఎల్లో మీడియా దత్తపుత్రుడు కి నచ్చక ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీరందరికీ రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలు ఓట్లు ద్వారా బుద్ధి చెప్పి వీరందరిని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి , మాజీ జడ్పిటిసి గురువారెడ్డి , స్థానిక సర్పంచ్ దిలీప్ రెడ్డి, కాలప్ప, మణి, మురుగేష్, చిన్నప్ప, అమృత రాజ్ లోకనాథ రాజ్ తహసిల్దార్ షబ్బీర్ భాష ఎంపీడీవో కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.