గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ నేతృత్వంలో ఆదివారం గూడూరు పట్టణంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అరుంధతిపాలెంలో పలు నివాసాల్లో వారు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేని పది వాహనాలను సీజ్ చేశారు. ఎటువంటి పత్రాలు లేని వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా అనుమానిత వ్యక్తుల వివరాలను వారు సేకరించారు.