తెలంగాణలో భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భూఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావం కారణంగానే ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.