ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య వికెట్ తీసిన LSG బౌలర్ దిగ్వేష్ రాఠీ స్లెడ్జింగ్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రియాంష్ ఆర్య వికెట్ తీసిన వెంటనే దిగ్వేష్ పరిగెత్తుకుంటూ అతడి దగ్గరకి వెళ్లారు. తన నోట్‌బుక్‌లో ప్రియాంష్ ఆర్య పేరు రాసుకున్నట్లుగా దిగ్వేష్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.