బర్డ్‌ఫ్లూ వైరస్‌తో రెండేళ్ల చిన్నారి మృతి

57చూసినవారు
బర్డ్‌ఫ్లూ వైరస్‌తో రెండేళ్ల చిన్నారి మృతి
AP: రాష్ట్రంలో తొలి బర్డ్‌ఫ్లూ మృతి కేసు నమోదైంది. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినడంతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మార్చి 16న బాలిక చనిపోగా, వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధ్రువీకరించారు. అధికారులు చిన్నారి తల్లిని విచారించినప్పుడు.. ‘కోడి కూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇచ్చాను. తిన్న తర్వాత బజ్బు పడింది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్