మదనపల్లె: రాష్ట్ర షూటింగ్ బాల్ పోటీల్లో అన్నమయ్య జిల్లా తృతీయ స్థానం

61చూసినవారు
మదనపల్లె: రాష్ట్ర షూటింగ్ బాల్ పోటీల్లో అన్నమయ్య జిల్లా తృతీయ స్థానం
కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో ఈ నెల 9,10 తేదీల్లో జరిగిన 7వ రాష్ట్ర షూటింగ్ బాల్ పురుషుల ఛాంపియన్ షిప్ 2024లో భాగంగా అన్నమయ్య జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించిందని షూటింగ్ బాల్ జిల్లా కార్యదర్శి గౌతమి సోమవారం తెలిపారు. తృతీయ స్థానం సాధించిన క్రీడాకారులను కెప్టెన్ కుమార్ , కోచ్ అండ్ మేనేజర్ యూసఫ్, మురళీలను, అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల అసోసియేషన్ అధ్యక్షులు గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి అభినందించారు.

సంబంధిత పోస్ట్