మదనపల్లి: కొత్త వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వండి

50చూసినవారు
మదనపల్లి: కొత్త వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వండి
గ్రామాలలో కొత్త వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని మదనపల్లి ఒకటవ పట్టణ సిఐ చాంద్ బాషా కోరారు. సోమవారం రాత్రి మదనపల్లి సొసైటీ కాలనీలో నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన చోదకులు తమ రక్షణ కొరకు హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్