ప్రధాని మోదీ నామినేషన్ తేదీ ఖరారు

70చూసినవారు
ప్రధాని మోదీ నామినేషన్ తేదీ ఖరారు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న మోదీ.. తాజాగా నామినేషన్ తేదీని ఖరారు చేశారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారని, ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, ప్రధాని మే 5న అయోధ్యను సందర్శించనున్నారు.

సంబంధిత పోస్ట్