పుత్తూరు పట్టణంలోని నారాయణ పాఠశాల నందు బుధవారం సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజియం కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కిరణ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.