తమిళనాడులోని నైవేలీ లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఏడు ఎలక్ట్రిషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ 4, ఎలక్ట్రిషియన్ 3 ఉద్యోగాలకు పదో తరగతి, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. వేతనం నెలకు రూ.30 వేల నుంచి రూ.38 వేలు ఇస్తారు. డిసెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ https://www.nlc-india.in.