ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధిని వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సంధ్యారాణి అన్నారు. "వైసీపీ హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ఇప్పుడు ధర్నాలు చేయడమేంటి? ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆనాడు పరదాల మాటున నక్కి ఇప్పుడు ధర్నాలా?" అంటూ జగన్‌ను మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు.