Nov 19, 2024, 01:11 IST/చొప్పదండి
చొప్పదండి
బోయినపల్లి: వరి కొయ్యలను కాల్చడంతో అనేక నష్టాలు
Nov 19, 2024, 01:11 IST
బోయినపల్లి మండలం కొత్తపేటలో మండల వ్యవసాయ అధికారి ప్రణీత, ఏఈవో రవళి పంటల నమోదు పరిశీలించారు. సోమవారం రైతులతో మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తాయి. ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పర్యావరణ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందన్నారు. కొయ్యకాల్లకు నిప్పుపెట్టాడముతో భూమి సారాన్ని కోల్పోవడంతో పాటు దిగుబడి తగ్గుతుందని అలాగే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందనీ రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు.