Nov 19, 2024, 03:11 IST/
మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ల బాధ్యత!
Nov 19, 2024, 03:11 IST
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేవాలయాల భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. సోలార్ ప్లాంట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక అభ్యున్నతితో పాటు ఉపాధికి భరోసా లభింస్తుందని భావిస్తోంది. అయితే, సోలార్ ప్లాంట్‌కు పైలట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా నర్సాపూర్‌ను ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం.