Nov 10, 2024, 14:11 IST/చొప్పదండి
చొప్పదండి
చొప్పదండి: బ్లూ కోర్టు సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన వ్యక్తిపై కేసు
Nov 10, 2024, 14:11 IST
బోయినపల్లి శివారులో ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనబడగా అతని వద్దకు బ్లూ కోర్ట్ సిబ్బంది పీసీ రమేష్, క్రాంతి కుమార్ వెళ్లి వివరాలు అడగగా అతడు బ్లూ కోర్టు సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ బూతు మాటలు తిట్టి తన చేతిలో ఉన్న బీరు సీసా పగలగొట్టి పొడుస్తానని బెదిరించగా సదర్ కానిస్టేబుల్ ఆకుల రమేష్ తప్పించుకున్నాడు. అట్టి వ్యక్తి పేరు తెలుసుకోగా మల్యాల గ్రామానికి చెందిన కనగర్తి సాయికుమార్ గా గుర్తించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై పృధ్విధర్ గౌడ్ ఆదివారం తెలిపారు.