అన్యాయంగా చంద్రబాబు కి సంకెళ్లు

1077చూసినవారు
అన్యాయంగా చంద్రబాబు కి సంకెళ్లు
స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సిఎం చంద్రబాబు కి మద్దతుగా దద్దాల హరిప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో చెర్లోపల్లి గ్రామం లో ఆదివారం న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతిమయమైన రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా న్యాయానికి మారుపేరు అయిన చంద్రబాబు కి సంకెళ్లు వేశారని తెలిపారు. ఈ కార్యక్రమం లో విజయ్, గంగాధర్, రాజన్న, నంద, నాగరాజ, లక్ష్మిపతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్