కెవికే లో పశువులు, కోళ్ల పెంపకంలో మెళుకువలపై శిక్షణ
కెవికె కలికిరి నందు పశువులు, కోళ్ల పెంపకంలో మెళుకువల గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డా., సమన్వయకర్త మంజుల మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో దాదాపు ప్రతి రైతు వ్యవసాయంతో పాటు పాడి సంపద కూడా కలిగి ఉండడం సంతోషిదాయకమని అన్నారు. డా. నవీన మాట్లాడుతూ పాడి కోళ్ల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను పాటించడం వలన వ్యాధి వృద్ధుని తగ్గించి అధిక లాభాలు గడించవచ్చు అని సమయానుకూల టీకాలను వేయించాలని తెలియజేశారు.