లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదు

14503చూసినవారు
వి. కోట మండలంలోని సచివాలయాలు లంచాలకు కేంద్రాలుగా మారాయి. వివరాల్లోకి వెళితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల వద్దకు పాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలను ఏర్పాటు చేశారు. లంచాలకు తావు లేకుండా పాలన అందించాలని శ్రీకారం చుట్టారు. మండలంలో లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. వి. కోట మండలంలో పలు కార్యాలయాలలో పనులు జరగాలి అంటే లంచాలు ఇవ్వక తప్పడం లేదని స్థానిక యం. డి. హెచ్ ఫౌండేషన్ అధినేత డా. యం. డి. పవన్ కళ్యాణ్ ఆవేధన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన తననే లంచాలు అడుగుతుంటే ఇంక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా రెవిన్యూ వ్యవస్థలో లంచాలు తినే చీడపురుగులు చేరాయని, సక్రమమైన రికార్డులు ఉన్నప్పటికీ లంచాలు చెల్లించక తప్పడం లేదని, మరో పక్కన వారి పరిధిలో లేనప్పటికీ పలు అధికారులు జోక్యం చేసుకొని నోటు కట్టలకు లొంగిపోయి ఏ రికార్డులు నైనా తారుమారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, పైసా చూపిస్తే చాలు ఏ పనైనా చేసే విధంగా తయారయ్యారని, ఒక చిన్న సంతకం కావాలన్నా, ఓ చిన్న పని జరగాలన్న లంచాలు ఇవ్వక తప్పడం లేని పరిస్థితి చోటుచేసుకుందని తెలియజేశారు. రాష్ట్రాధినేత లంచాలకు తావులేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించాలని అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే ఇక్కడ అధికారులు మాత్రం ఆ ఆశల్ని, రాష్ట్ర అధినేత కష్టాన్ని వమ్ముపాలు చేస్తున్నారు. ఇంకైనా అధికారులు నాయకులు జోక్యం చేసుకొని ఈ అరాచకాలని, అన్యాయాలను కట్టడి చేసి ఈ లంచగొండల నుంచి సామాన్య ప్రజలను రక్షించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్