పిటీఎం మండలంలోని శ్రీ ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వహణ సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠ శర్మ ఆరుద్ర నక్షత్రంలో ఏకవార రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు.