అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు ఓ వీఆర్వో దొరికాడు. ఓ రైతు నుండి పొలాన్ని మ్యుటేషన్ చేసేందుకు లంచం అడిగిన ఘటనలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎసీబీ డైరెక్టర్ జనరల్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా కలికిరి మండలం మర్రికుంటపల్లి వీర్వోగా పనిచేస్తున్నగొండి సుధాకర్, హర్షద్ అనే రైతు తన భార్య పేరు కొత్తగా కొన్న పొలాన్ని మ్యుటేషన్ చేయించి, పాస్‌పుస్తకం చేయించమని కోరగా రూ.4 వేలు లంచం అడిగాడు. ఈ నేపథ్యంలో ఎసిబిని ఆ రైతు ఆశ్రయించాడు. ఈ క్రమంలో లంచం తీసుకుంటున్న ఆ వీఆర్వోను సోమవారం మధ్యాహ్నం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఎసీబీ అధికారి తెలిపారు. ఆ అధికారిని నెల్లూరు ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.