ఈ నెల 12 నుంచి కొత్త మద్యం విధానం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. 'MRP కంటే అధిక రేటుకు విక్రయిస్తే చర్యలు తప్పవు. పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులకు అనుమతి లేదు. స్కూళ్లు, ఆలయాలకు వంద మీటర్ల పరిధిలో మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి లేదు. ప్రతి షాపులో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకూ పాత విధానమే అమల్లో ఉంటుంది' అని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు.