కలకడ: ఇంటి నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కలకడ మండలంలోని కట్టకింద పల్లి లేఔట్ లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇంటి గోడల నిర్మాణాన్ని శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం బిల్లులకు సంబంధించి తగిన సమయంలో డబ్బులు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ శివయ్య, సిబ్బంది పాల్గొన్నారు.