పలమనేరు లో 23న జరుగనున్న హలో మాల చలో పలమనేరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు శివయ్య కోరారు. మంగళవారం పీలేరులో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పట్ల మాలలు ఐక్యంగా ఉండాలని, వర్గీకరణ వల్ల ఎంత నష్టం జరుగుతుందో మాలలకు తెలియజేయుటకు హలో మాల, చలో పలమనేరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలం నుండి మాల, మేధావులు, ఉద్యోగ సంఘాలు, మాల ప్రజా సంఘాలు పాల్గొనాలని కోరారు.