పీలేరు నియోజకవర్గంలోని కలికిరి అభివృద్ధికి నల్లారి కుటుంబం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కలికిరి పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలికిరిలోని విద్యా సంస్ధలతో పాటు ఐ.టీ.బీ.పి, సీ. ఆర్.పి.ఎఫ్, బీ.ఎస్.ఎఫ్, సైనిక్ స్కూల్ వంటి రావడం జరిగిందన్నారు.