కొన్నేళ్లుగా బర్త్ సర్టిఫికెట్ లేక ఆధార్ కార్డుకు నోచుకోని గిరిజనులకు చౌడేపల్లి ఎమ్మార్వో హనుమంతు నాయక్ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేశారు. దిగువపల్లి పంచాయతీ గట్టువారిపల్లి కు చెందిన 18 మందికి ఆయన గురువారం సర్టిఫికెట్లు అందజేసి, ఆధార్ కేంద్రాలకు వారిని తీసుకెళ్లి ఆధార్ కార్డులను జారీ చేయించారు. అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పవన్ పాల్గొన్నారు.