కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బుధవారం బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సీ. చందక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.