అఖిలభారత వెనుకబడిన తరగతుల సమైక్య జిల్లా అధ్యక్షుడిగా బంగారుపాలెం మండలం రాగి మాను పెంట పంచాయితీ మొగిలి ఈశ్వర పాల్యం కు చెందినచెందిన నారే సోమశేఖర్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య ఆదివారం సోమ శేఖర్ కు నియామక పత్రాన్ని అందజేశారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎంపికైన జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ పేర్కొన్నారు.