రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేయండి: ఎంపీపీ

1062చూసినవారు
రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేయండి: ఎంపీపీ
రానున్న ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యేకు సంబంధించిన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా పుంగనూరు మండలంలోని సుగాలి మిట్ట, చిన్న తండా, నామతీర్ణపల్లి, చిన్న గడదేసి గ్రామాలలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి చొరవతో మండలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్