తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరు కుటుంబాలకు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న మృతుల కుటుంబాలను పరామర్శించిన ఆయన ఒక్కో కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. టీటీడీ బోర్డును రద్దుచేసి, మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.