పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో శనివారం ఉదయం తుఫాను ప్రభావంతో మళ్లీ వర్షం ప్రారంభమైంది. ఉరుములతో కూడిన వర్షం రావడంతో ప్రజలు కాస్త భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఒకరోజు వర్షం పడకపోవడంతో ఇక వర్షం లేదనుకున్న రైతన్నలు మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో తాము పండిస్తున్న పంటలకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు.