తాగునీటి బోరుకు మరమ్మతులు చేయించండి

61చూసినవారు
తాగునీటి బోరుకు మరమ్మతులు చేయించండి
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని స్వయంబేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న తాగునీటి బోరు సుమారు నెల రోజుల నుంచి మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీనితో స్థానిక ప్రజలు మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం వెళ్లిపోయిన నీటి కష్టాలు మాత్రం తమకు తప్పడం లేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బోరును బాగు చేపించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్