పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారి పల్లిలో మకర సంక్రాంతి సందర్భంగా తిరు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సదుమమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం తిరు ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అయ్యప్ప స్వామికి సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.