Jun 18, 2024, 10:06 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
జిల్లా కలెక్టర్ ను కలిసిన అధికారులు
Jun 18, 2024, 10:06 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా ను మంగళవారం పలువురు అధికారులు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేశారు.