రామసముద్రం తహశీల్దార్ కె. నిర్మలా దేవి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోసం ఇక్కడ పని చేసిన శ్రీనివాసులు తిరిగి అనంతపురం జిల్లాకు వెళ్లారు. ఈ మేరకు కర్నూలు జిల్లా నుంచి బదిలీపై రామసముద్రానికి నిర్మలా దేవి వచ్చారు. ఆమె మాట్లాడుతూ. రెవెన్యూ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరిస్తామని తెలిపారు.