రామసముద్రం గాజుల నగరంలో రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ కనకదుర్గమ్మ గంగ జాతర బుధవారం ముగిసింది. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. మహిళలు అమ్మవారికి ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిశ్రద్ధలతో గ్రామంలోని ఏడు గ్రామ దేవతలకు దీపాలు, బోనాలు మోసి మొక్కులు చెల్లించారు. ఈ జాతరకు స్థానికులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామం బంధుమిత్రులతో కలకళలాడింది.