తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బీఎన్. కండ్రిగ మండలంలో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వీధులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు ప్రయాణం కష్టతరంగా మారింది. అల్పపీడన ప్రభావానికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఉదయం నుంచి విడతలవారీగా వర్షం కురుస్తోంది.