తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి గ్రామీణ ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా మారాయి. అల్పపీడనం ప్రభావంతో సోమవారం సాయంత్రం నుండి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో సోమవారం అర్ధరాత్రి నుండి మండల వ్యాప్తంగా వర్షం కురిసింది. వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఒకవైపు వర్షం మరోవైపు మంచు దుప్పటితో ప్రజలు చలికి వణికి పోతున్నారు.