నారాయణవనం మండలం భీముని చెరువు గ్రామంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి తహశీల్దార్ జయరాములు ఆదివారం ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. సర్వే నంబర్ 72లో కాలువ పొరంబోకు ఆక్రమణలపై ఫిర్యాదు అందడంతో తనిఖీలు నిర్వహించి పరిశీలించారు. సర్వే చేసి ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.