వెంగళత్తూరులో ఘనంగా రోహిణి నక్షత్ర పూజలు

57చూసినవారు
వెంగళత్తూరులో ఘనంగా రోహిణి నక్షత్ర పూజలు
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో వెలసివున్న శ్రీరుక్మిణి, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం రోహిణి నక్షత్రం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామి చిత్రపటంను ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి నైవేద్యంగా మధుర పదార్థములను అర్పించారు. భజన గురువులు లోకేష్ దాస్, శివకుమార్ దాస్, తులసీదాస్లచే పండరి భజన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త విజయ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్