సత్యవేడు: విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి

64చూసినవారు
సత్యవేడు: విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి
సత్యవేడు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖా మంత్రి సవిత ఆరా తీశారు. వైరల్ ఫీవర్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న మంత్రి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఎంఅండ్ హెచ్వో శ్రీధర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్