తిరుపతి జిల్లా నాగలాపురంలో వికెఎం స్ట్రీట్ లో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని ధర్మశాస్త అయ్యప్ప స్వామివారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నవీన్ శర్మ స్వామి వారికి పంచామృతములతో అభిషేకము చేశారు. అనంతరం స్వామివారిని చందనంతో ప్రత్యేకముగా చందనం, వివిధ పుష్పాలతో అకరించారు. ధూపదీప నైవేద్యములను సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కలసి భజనలు చేశారు.