నారాయణవనం మండలం పాలమంగళం ఏఏడబ్ల్యూలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఇసుక డంప్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పుత్తూరు డిఎస్పీ రవికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్, ఎస్సై పాల్గొన్నారు.