పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

78చూసినవారు
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం కాటూరు -పదో మైలు సమీపంలో గురువారం కారు పొలంలోకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. లారీని తప్పించబోయి కరెంటు స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్