తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి మ్యూజియాన్ని భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మ్యూజియం ఆఫీసర్ విజయలక్ష్మీ, డిప్యూటీ ఈవో (హెల్త్)ఆశాజ్యోతి, ఈఈ-1 సుబ్రహ్మణ్యం, డీఈ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.