శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమనాడు గ్రామంలో సోమవారం రైతులతో కలిసి శ్రీకాళహస్తి వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి పంట పొలాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంటపై చీడపీడలు ఆశించాయన్నారు. వరి పంటకు ఆశించిన ఉల్లికోడు నివారణ కొరకు ఎకరానికి పృర్థన్ 3జి గుళికలు 8 నుంచి 10 కిలోలు వాడుకోవాలని రైతులకు తెలిపారు. వరి పైరుకు నత్రజని ఎరువులు తగు మోతాదులో వాడాలన్నారు.