శ్రీకాళహస్తి: వర్షపు నీటి నిల్వతో ఇబ్బందులు

83చూసినవారు
శ్రీకాళహస్తి: వర్షపు నీటి నిల్వతో ఇబ్బందులు
శ్రీకాళహస్తి మండలం తొండమనాడు నందు కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచి పోవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మిట్టకండ్రిగ వద్ద రోడ్డు మొత్తం గుంతల మయంగా ఉండడంతో అమ్మపాలెం, తొండమనాడు, బండారుపల్లి వైపు వెళ్లే గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు చేపట్టాలని ఆదివారం గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్