బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, ఆర్ఎస్ఎస్ నాయకులు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గురువారం హైందవ శంఖారావం సభకు సంఘీభావంగా గురువారం శ్రీకాళహస్తి పట్టణం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. హిందూ ఆలయాలను సంస్కరించాలని ధ్యేయంతో జనవరి 5 విజయవాడలో హైందవ శంఖారావం బహిరంగ సభ చేపట్టామన్నారు. అన్య మతస్థుల పెత్తనం నశించాలన్నారు. ఆలయాల నిర్వహణ హిందూ సంస్థలకు అప్పగించాలన్న డిమాండ్ చేశారు.